Klin Kaara: జెండా ఎగరవేసిన ఉపాసన కూతురు క్లిన్ కారా… ఖుషి అవుతున్న మెగా ఫాన్స్!

0
26

Klin Kaara: క్లిన్ కార కొణిదల మెగా వారసురాలిగా మెగా ఇంట్లోకి అడుగుపెట్టడంతో మెగా కుటుంబంలో ఎంతో ఆనందం నెలకొంది.ఉపాసన రాంచరణ్ దంపతులు పెళ్లి అయిన 11 సంవత్సరాలకు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి క్లిన్ కారా అని నామకరణం కూడా చేశారు. అయితే ఇప్పటివరకు ఉపాసన దంపతులు తమ చిన్నారి ఫోటోను అభిమానులతో ఎక్కడ పంచుకోలేద.

ఇలా ఇప్పటివరకు క్లిన్ కారా ఫోటోని బయట పెట్టకపోవడంతో మెగా వారసురాలు ఎలా ఉంటుందో చూడాలని ఆత్రుత ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఈ విధంగా క్లిన్ కారా కోసం ఎదురుచూస్తున్నటువంటి అభిమానులకు ఉపాసన ఒక ఫోటోని షేర్ చేస్తూ అందరిలోనూ సంతోషాన్ని నెలకొల్పారు. అయితే ఇందులో తన కుమార్తెను చూపించి చూపించనట్టు ఉన్నటువంటి ఫోటోని ఈమె షేర్ చేశారు.

ఆగస్ట్ 15వ తేదీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన తల్లిదండ్రులకు కూడా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అయితే ఉపాసన కూతురు చేతుల మీదుగా ఈ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరింప చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Klin Kaara: అద్భుతమైన క్షణాలు….


ఈ ఫోటోలో భాగంగా ఉపాసన తన కుమార్తెకు సాంప్రదాయ దుస్తులు అయినటువంటి లంగా జాకెట్ వేశారు. అలాగే చిన్నారి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ ఉన్నట్టు ఉంది. ఇక ఈ ఫోటోని ఈమె షేర్ చేస్తూ క్లిన్ కారా తన మొదటి స్వాతంత్ర దినోత్సవపు వేడుకలను తన తాతయ్య అమ్మమ్మలతో కలిసి జరుపుకుందని ఇవి ఎంతో అద్భుతమైన క్షణాలు అంటూ ఈ ఫోటోని షేర్ చేయడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.