తేనె మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి మనందరికీ తెలిసిందే. అలాగే లవంగాల వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ లవంగం, తేనెను విడి విడిగా తీసుకుని ఉంటారు. కానీ ఇవి రెండూ కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని, చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను నియంత్రించడంలో ఇవి చక్కగా ఉపయోగపడతాయి అని అంటున్నారు. అయితే ఈ రెండింటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం..

తేనే,లవంగాలలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.ఇక శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యలను తగ్గించడంలో తేనే లవంగాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇందుకోసం మూడు లవంగాలను మెత్తగా పొడిచేసి, అందులో ఒక చెంచా తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల దగ్గు గొంతు నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అలాగే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఇవి రక్తంలో షుగర్ లెవెల్ నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందుకు మూడు లవంగాలను పొడి చేసి స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి.
ఈ తేనే లవంగాలు కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో కూడా ఇవి సహాయపడతాయి. అంతే కాకుండా ఈ రెండింటి టీ గా కూడా చేసుకోవచ్చు. ఇవి రెండూ కేలరీలను బర్న్ చేయడమే కాకుండా, ఆకలిని తగ్గిస్తాయి. అదేవిధంగా జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. నోటిపూతల నుంచి ఉపశమనం పొందడానికి తేనె,లవంగాల మిశ్రమం బాగా పనిచేస్తుంది. ఇందుకోసం చెంచా తేనెలో లవంగాల పొడిని కలిపి పేస్టులా చేసి నోటి పూత అప్లై చేయాలి.


































