చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే.. ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్లే. ఏ చిన్న విషయం జరిగినా వెంటనే మనకు క్షణాల్లో తెలిసిపోతోంది. అందుకే దీనికి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయారు. ఇదిలా ఉండగా.. చాలామందికి వాకింగ్ చేసే సమయంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చేసే అలవాటు ఉంటుంది. అయితే ఇలా వాటిని చెవిలో పెట్టుకుంటూ.. వాకింగ్ లేదు జాగింగ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా.. దీనిపై నిపుణులు ఏమంటున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..

ఆరోగ్యం కోసం ఉదయాన్నే చేసే వాకింగ్ సమయంలో కూడా మొబైల్ వాడుతున్నారు. ఇది సరైంది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ముందుగా ఇలా చేయడం ద్వారా వెన్నెముకకు ఎక్కువగా హాని చేకూరుతుంది.
వాకింగ్ సమయంలో వెన్నెముక నిటారుగా ఉండాలి.. కానీ మొబైల్ ద్వారా పాటలు వింటున్న సమయంలో ఎక్కువగా మొబైల్ స్క్రీన్ పై చూస్తుంటాం. ఇలా చేయడం వల్ల వెన్నెముక షేప్ లో మార్పువస్తుంది.మొబైల్ వాడుకుంటూ వాకింగ్ చేస్తే.. కండరాల నొప్పి కూడా అధికంగా ఉంటుందట. అంతేకాకుండా మెడనొప్పి కూడా ఉంటుందట.
ఏకాగ్రత దెబ్బతిని అడుగులు వేసే సమయంలో తప్పుగా వేస్తుంటాం.. దీంతో ఎక్కువగా ఆ ఒత్తిడి నడుముపై నొప్పి ఎక్కువగా అవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏకాగ్రత అంతా వాకింగ్ పైనే ఉండాలి. ఇలా చేతులను ఊపుకుంటూ.. అడుగు వెనుక అడుగు వేస్తూ చేయాలి. ఫోన్ మాట్లాడుతూ వాకింగ్ చేయడం.. పాటలు వింటూ వాకింగ్ చేయడం వల్ల కేవలం.. మీరు దూరం నడవగలరు కానీ.. దాని వల్ల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం అనేది జరగదు అంటూ నిపుణులు చెబుతున్నారు. ఏకాగ్రత అనేది ముఖ్యం అంటూ చెబుతున్నారు.



































