Kota Srinivasa Rao: తెలుగు సినీ నటుడు కోట శ్రీనివాస రావు గురించి అందరికీ పరిచయమే. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఈయన ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తున్నాడు. ఈయన సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందు నాటకాలు వేసేవాడు.

ఇక ఇండస్ట్రీలో అడుగు పెట్టాక తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1970 లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కోట శ్రీనివాసరావు దాదాపు 250 సినిమాలకు పైగా నటించారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. తండ్రి, తాత, మామయ్య వంటి పలు సహాయ పాత్రలలో నటించారు. అంతేకాకుండా నెగటివ్ పాత్రలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి తాజాగా కోట శ్రీనివాస్ రావు కొన్ని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్ లు కూడా వైరల్ గా మారాయి. తాజాగా కోట శ్రీనివాస్ రావు ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు సినిమాల గురించి కొన్ని విషయాలు పంచుకోవడమే కాకుండా రాజకీయ పరంగా కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు.
ఆ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాస్ కు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కి ఒలిచి పెట్టిన అరటిపండును ఇచ్చాడని కాస్త వెటకారంగా స్పందించాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి కూడా వెటకారం గానే
స్పందించాడు.
వైయస్ జగన్ పై అలా కామెంట్ చేసిన కోట..
ఆంధ్రప్రదేశ్ లో ఆకులు పోగుచేసి విస్తరాకులు కుట్టుకోవాలి అని అంటూ ఆ జ్ఞానం వాళ్ళకి ఉండాలి అని.. అప్పుడు గెలిపించి ఇప్పుడు అనుభవిస్తున్నారు అని కామెంట్ చేశాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం గురించి కూడా కొన్ని విషయాలను తెలిపాడు కోట శ్రీనివాస రావు.






























