Krishna Vamsi: సాధారణంగా ఒక సినిమాని తెరకెక్కించే సమయంలో ప్రతి ఒక్క సన్నివేశం చాలా క్లుప్తంగా ఉండాలని దర్శకులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఒక సన్నివేశం చాలా సహజంగా మంచి ఎమోషన్స్ తో ఉండటం కోసం డైరెక్టర్ కృష్ణవంశీ ఎంతటి సాహసానికైనా వెనకాడరు.ఎంతగా అంటే సన్నివేశం సరిగా రావడం కోసం హీరోకు రెండు పెగ్గులు తాగించడం కూడా కరెక్టే అనేలా ఈయన వ్యవహార శైలి ఉంటుంది.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కృష్ణవంశీ జగపతిబాబు నటించిన అంతఃపురం సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో చాలా ఎమోషన్స్ పండాల్సి ఉంది. అయితే ఈ ఎమోషన్స్ రావడం కోసం ఈయన ఏకంగా నటుడు జగపతిబాబుకి మద్యం తాగించారని వెల్లడించారు.
జగపతి బాబు క్యారెక్టర్ బాగా వచ్చేందుకు.. అతను సీన్స్ చేసేటప్పుడు తానే టకీలా షాట్స్ ఇచ్చినట్లు కృష్ణవంశీ వెల్లడించారు. జగపతిబాబుకి కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంది కనుక తనకు ఇలా మద్యం తాగించానని తెలిపారు.ఇలా చేయటం వల్ల ఆ సన్నివేశాలు ఎంతో సహజసిద్ధంగా వచ్చాయని ఇప్పటికే ఆ సన్నివేశాల గురించి జనాలు గుర్తు చేసుకుంటూ ఉంటారని కృష్ణవంశీ తెలిపారు.

Krishna Vamsi: జగపతిబాబుకు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంది..
ఇలా జగపతి బాబుకి ఆ కెపాసిటీ ఉంది కనుక తనతో ఇలా చేయించాను కానీ సినిమా షూటింగులకు మద్యం తాగి రావడం పూర్తిగా తప్పని తెలిపారు. అంత:పురం సినిమాలో క్యారెక్టర్ మరింత వైల్డ్‌గా ఉండేందుకు అలా చేశామని తెలిపారు.ఇలా అంతపురం సినిమా గురించి జగపతిబాబు క్యారెక్టర్ గురించి ఈ సందర్భంగా కృష్ణవంశీ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































