Krishna Vamsi : రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన కృష్ణ వంశీ గులాబీ, సింధూరం, సముద్రం, అంతఃపురం, నిన్నేపెళ్లాడతా, మురారి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నచ్చారు. ఖడ్గం వంటి సినిమా అయిన మొగుడు వంటి ఫ్యామిలీ డ్రామా అయిన కృష్ణ వంశీ స్టైల్ డిఫరెంట్. కానీ ప్రస్తుతం చాలా గ్యాప్ తరువాత కృష్ణ వంశీ సినిమా చేస్తున్నాడు. రంగ మార్తాండా అనే సినిమాతో వస్తున్న కృష్ణ వంశీ తన సినిమా కెరీర్ లోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మొదటి తెలుగు సినిమాను గ్లోబల్ చేసింది ఆయనే……

నాగార్జున అంటే డైరెక్టర్ కృష్ణ వంశీకి చాలా ఇష్టం. నాగార్జున ప్రాక్టికల్ గా ఆలోచిస్తారంటు చెప్పారు కృష్ణ వంశీ. అప్పటి వరకు ఒకేలాంటి చిత్రాలు వస్తున్న తెలుగులో శివ లాంటి ఒక సినిమా ఆయనే చేసారు. ఇతర భాషా దర్శకులను తెలుగులో పరిచయం చేసారు మణిరత్నం తో గీతాంజలి, కన్నడ డైరెక్టర్ రవిచంద్రన్ తోనూ అలాగే మలయాళం దర్శకులతోను బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ లాంటి వాళ్ళతో పనిచేసారు. తెలుగు సినిమాను గ్లోబలైజ్ చేసింది ఆయనే మొదట.

అఖిల్ ను పరిచయం చేయడానికి నన్ను అడిగితే చేయననడం అపద్ధం అని క్లారిటీ ఇచ్చాడు కృష్ణ వంశీ. నాగార్జున లాంటి వ్యక్తి అడిగితే ఖచ్చితంగా చేసేవాడిని అయితే ఆయన నన్ను అడగలేదు మా మధ్య అలాంటి ఒక చర్చ జరగలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. తెలుగు సినిమాల్లో ప్రయోగాలు చేసింది మొదట ఆయనే అంటూ అందుకే అయనంటే గౌరవం, అలాగే ఇష్టం ఉన్నాయని మొదటి సినిమా కోసం నన్ను ఆడుకుంటే ఖచ్చితంగా చేసుండేవాడిని అంటూ చెప్పారు.































