Krishnam Raju: అలనాటి ప్రముఖ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో ఎంతోమంది సినీ ప్రముఖులు కృష్ణంరాజు పార్తివదేహాన్ని దర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి వంటి ప్రముఖులు కృష్ణంరాజుకు నివాళులు అర్పించారు. మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా కృష్ణంరాజు పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కృష్ణంరాజు ఇంటికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించాడు ఆ తర్వాత ప్రభాస్ తో కొంత సమయం చర్చించాడు.అయితే ఇక్కడే అల్లు ప్రవర్తన అందరికీ వింతగా అనిపించింది. కృష్ణంరాజు మృతి పట్ల అందరూ సంతాపం తెలియజేస్తూ బాధలో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఆయన మృతదేహం వద్ద నవ్వుతూ కనిపించాడు. అంతే కాకుండా ప్రభాస్ తో మాట్లాడే సమయంలో కూడా అల్లు అర్జున్ మొహంలో నవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో నెటిజన్స్ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు.
కృష్ణంరాజు మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోవడంతో అందరూ దుఃఖంలో మునిగి ఉన్నారు. అల్లు అర్జున్ మాత్రం ఆయన పార్థివ దేహం వద్ద ఇలా నవ్వుతూ కనిపించడంతో నెటిజన్స్ అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు. పరిశ్రమకు చెందిన వ్యక్తిగా కృష్ణంరాజు లాంటి ఒక ఇండస్ట్రీ పెద్దను కోల్పోయాం అన్న బాధతో ఉండాల్సింది పోయి ఇలా నవ్వటం ఏంటి అని ఏకీపారేస్తున్నారు.

Krishnam Raju: అల్లు అర్జున్ పై మండిపడుతున్న యాంటీ ఫ్యాన్స్..
అల్లు అర్జున్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోని వెనకేసుకు వస్తూ అల్లు అర్జున్ మొహంలో నవ్వు లేదని అతని మొహం విషాదంలో ఉందని తమ అభిమానం నటుడికి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం ఇదే అదునుగా భావించి తనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
































