Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్ను మూసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. కృష్ణంరాజు మరణించడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కృష్ణంరాజు గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.ఇక ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి కృష్ణంరాజుకి ముగ్గురు కుమార్తెలు కావడంతో ఈయన వారసుడిగా ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఇలా ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఎన్నో సలహాలు సూచనలు చేస్తూ ఆయన ఎదుగుదలకు కృషి చేశారు.ఈ విధంగా ప్రభాస్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా ఎదగడం చూసిన కృష్ణంరాజు ఎంతో సంబరపడ్డారు. అయితే నేడు ప్రభాస్ పెదనాన్న చనిపోవడంతో అన్ని తానై దగ్గరుండి ఆయన కార్యక్రమాలను చూసుకుంటున్నారు.ఇకపోతే కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో జన్మించారు. ఈ క్రమంలోనే ఆయన సమారాధన కార్యక్రమాల కోసం కృష్ణంరాజు కుటుంబ సభ్యులు మొత్తం రెండు రోజులపాటు మొగల్తూరులో ఈ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
ఈ క్రమంలోనే కృష్ణంరాజు పై ఉన్న అభిమానంతో కోనసీమ జిల్లా ప్రజలు ఆయన మైనపు విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొత్తపేటలోని ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ని సంప్రదించి కృష్ణంరాజు మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. అయితే శిల్పి రాజ్ కుమార్ కేవలం నాలుగు రోజులలోనే ఈయన మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Krishnam Raju:కృష్ణం రాజు గారి పై అభిమానంతో…
ఇలా కృష్ణంరాజు గారిపై ఉన్న అభిమానంతో కోనసీమ జిల్లా ప్రజలు ఆయన విగ్రహాన్ని తయారుచేసి ఆయన దశదిన కార్యక్రమానికి ఈ విగ్రహాన్ని అందజేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ విషయంపై శిల్పి రాజ్ కుమార్ మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా కృష్ణంరాజు గారికి అభిమానిని అయితే ఆయన మరణం తనని ఎంతగానో బాధించిందని ఈయన వెల్లడించారు. ఇకపోతే ప్రస్తుతం కృష్ణంరాజు గారికి సంబంధించిన ఈ మైనపు విగ్రహ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.