Kriti Shetty: అక్కినేని నాగచైతన్య కృతి శెట్టి జంటగా తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య అలాగే చిత్ర బృందం చెన్నైలోని మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి కృతి శెట్టి నాగచైతన్య గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ… తమిళంలో నాకు ఇది రెండవ సినిమా అని తెలియజేశారు. ఇక నాగచైతన్యత కూడా తనకు ఇది రెండవ సినిమా అని తెలిపారు.
నాగచైతన్యతో ఇదివరకే తాను బంగార్రాజు సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్యతో కలిసి కృతి శెట్టి కస్టడీ సినిమాలో నటించారు. అయితే నాగచైతన్యతో నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని,తనతో నటించడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుందంటూ ఈ సందర్భంగా కృతి శెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Kriti Shetty: మంచి ఎక్స్పీరియన్స్…
గతంలో థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాగచైతన్యకు ఆ సినిమా తీవ్ర నిరాశను పరిచింది. అయితే కస్టడీ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇందులో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అందుకుంటుందని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా సక్సెస్ నాగచైతన్యకు ఎంత అవసరమో నటి కృతి శెట్టికి సైతం అంతే అవసరమని చెప్పాలి.ఈమె నటించిన గత మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి ఈ సినిమా సక్సెస్ అయితేనే తన కెరియర్ ముందుకు సాగుతుందని చెప్పాలి.































