సాధారణంగా మనకు ధన ప్రాప్తి కలగాలని ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని ప్రగాఢ నమ్మకం. అయితే మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోలను ఒక్కొక్కరు వారి ఇష్టాలకు అనుగుణంగా ఉన్న ఫోటోలను పెట్టుకొని పూజిస్తుంటారు. కానీ కొన్ని రకాల ఫోటోలను పూజించటం వల్ల ధన ప్రాప్తి కలగడం ఏమో కానీ, ధన నష్టం వాటిల్లుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే లక్ష్మీదేవి ఎలాంటి ఫోటోలు మన ఇంట్లో ఉండకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఎక్కువ మంది ఇళ్లలో తామర పువ్వు పై లక్ష్మీదేవి కూర్చున్న ఫోటో కనిపిస్తుంటుంది. ఇలాంటి ఫోటోను పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. కానీ తామర పువ్వు పై లక్ష్మీ దేవత నిల్చుని ఉన్న ఫోటోలను పూజించకూడదు ఆ ఫోటోలకు పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
లక్ష్మీ దేవత కొన్ని ఫోటోలలో గుడ్లగూబ పై కూర్చుని దర్శనమిస్తుంటారు. అలాంటి ఫోటోలను ఇంట్లో పెట్టుకొని అసలు పూజించకూడదు. ఇలాంటి ఫోటోలను పూజించటం వల్ల ధన నష్టం వాటిల్లుతుంది.అలాగే విష్ణుభగవానుడు లక్ష్మీదేవి గరుడ పై కూర్చుని ఉన్నటువంటి ఫోటోలను పూజించడం వల్ల కొంత వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
శేషతల్పంపైవిష్ణువు పడుకొని ఉండగా లక్ష్మీదేవి ఆయన పాదాల చెంత కూర్చుని ఉన్న ఫోటోలను పూజించడంవల్ల ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది.లక్ష్మీదేవి తోపాటు కుబేరుడు ఉన్న ఫోటోలు ఇంట్లో పెట్టుకొని పూజించడం ద్వారా ఆ ఇంట్లో లక్ష్మి దేవి తాండవం చేస్తుందని చెప్పవచ్చు.ఇక పాదరసంతో తయారుచేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజించడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి. అంతేకాకుండా మా ఇంట్లో ధన ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది.






























