Lavanya Tripati: మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించినటువంటి మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సిరీస్ విడుదలైనటువంటి సందర్భంలో ఈమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా లావణ్య త్రిపాఠి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాలని ఆరాటపడుతూ నేను వచ్చిన అవకాశాలన్నింటిని కూడా సద్వినియోగం చేసుకోలేదని నేను చేసే సినిమాలు తక్కువ సినిమాలే అయినప్పటికీ కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలోనే నటించాలనుకున్నాను అలాంటి సినిమాలలోనే నేను నటించాలని ఆ సినిమాలే నాకు గుర్తింపు తీసుకువచ్చాయని లావణ్య త్రిపాఠి తెలిపారు.
ఇక పెళ్లి తర్వాత తన జీవితం గురించి ఈమె మాట్లాడుతూ పెళ్లి తర్వాత నా జీవితం ఏమీ మారలేదు నేను మెగా ఇంటికి కోడలుగా వెళ్లాను కనుక నువ్వు ఇలాగే చేయాలి అలా చేయాలి అనే కండిషన్స్ నాకు పెట్టలేదని నేను చాలా స్వేచ్ఛగా ఉన్నానని తెలిపారు. వరుణ్ రూపంలో నన్ను బాగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి నాకు దొరికారని ఈమె తెలిపారు.
గతంలో ఉన్నట్టే ఇప్పుడు ఉన్నాం…
గతంలో మేం ఎలా ఉండే వాళ్ళమో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామని ఇక ఏదైనా ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలు నేను వరుణ్ ఇద్దరు కూడా మాట్లాడుకునే వాళ్ళు ఇక ఇప్పుడు కూడా అదే జరుగుతుందని నా సిరీస్ చూసి చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారని లావణ్య తెలిపారు. ఇక కెరియర్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు.































