Mrunal Thakur: టీవీ సీరియల్స్ లో నటిగా నటిస్తూ అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈమె హీరోయిన్ గా బాలీవుడ్ సినిమాలలో నటిస్తే బిజీగా ఉన్నారు. అయితే ఈమె సీతారామం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా తెలుగులో నటించే అవకాశాలు వచ్చాయి. ఇకపోతే ఇటీవల నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ద్వారా కూడా మంచి సక్సెస్ అందుకున్నటువంటి మృణాల్ ఠాకూర్ అనంతరం విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇకపోతే ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో వరుసగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే నటి మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ సెలబ్రిటీలకు అప్పుడప్పుడు విరామం అవసరమని కామెంట్లు చేశారు.
తీరిక లేకుంట గడిపాను..
ప్రస్తుతం సినీ ప్రయాణం చాలా వేగంగా కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో కుటుంబానికి సరైన సమయం కేటాయించాలని తెలిపారు. అందుకే నటీనటులు ఇండస్ట్రీకి అప్పుడప్పుడు విరామం ఇచ్చి తమ కుటుంబంతో ప్రయాణాలు చేస్తూ గడపాలని తెలిపారు. నేను రెండు సంవత్సరాల పాటు తీరిక లేకుండా కష్టపడుతూ గడిపానని కొన్నిసార్లు నిద్ర కోసం ఆరాటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ ఈమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.































