Raviteja: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఇలా ఈయనని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. అలాంటి వారిలో మాస్ మహారాజ రవితేజ ఒకరు.

రవితేజకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించారు. అనంతరం ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా రవితేజ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే తాజాగా రవితేజకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. రవితేజ కేవలం హీరోగా మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్ లో కూడా నటించారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఈయన దూరదర్శన్ లో ప్రసారమవుతున్నటువంటి ఋతురాగాలు అనే సీరియల్ లో ఒక ఎపిసోడ్లో నటించారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్లో వారం రోజులపాటు పాల్గొన్నారు.
ఋతురాగాలు…
ఇలా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నందుకు ఈయనకు 5000 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక ఈ సీరియల్ లో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించగా హీరోగా నటుడు రాజీవ్ కనకాల నటించారు. ఈ సీరియల్ తర్వాత ఈయనకు వరుసగా సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి కానీ ఈయన సినిమాలలో కొనసాగాలన్న ఉద్దేశంతో మిగతా సీరియల్ అవకాశాలను రిజెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































