Lavanya Tripati: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాటి ఎంగేజ్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ప్రేమ పక్షులు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ 9వ తేదీ మణికొండ లో ఉన్న నాగబాబు నివాసంలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుక కుటుంబ సభ్యులకు సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ కి మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా వారు ఇరువురికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి ప్రేమ గురించి గతంలో రక రకాలుగా వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో ఇద్దరిమధ్య ప్రేమ లేదని చెప్పిన వీరు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి సిద్ధమయ్యారు.
లావణ్య త్రిపాఠి మెగా కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టడానికి వరుణ్ తేజ్ కొన్ని కండిషన్స్ పెట్టాడని .. ఆ కండిషన్స్ కి లావణ్య అంగీకరించడంతో ఆమెతో పెళ్లికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా లావణ్య త్రిపాఠి సైతం వరుణ్ తేజ్ కి ఒకే ఒక కండిషన్ పెట్టినట్లు సమాచారం . అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లావణ్య త్రిపాఠి ఒక మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి.

Lavanya Tripati: ప్రొడక్షన్ రంగంలో లావణ్య…
మొదటి నుంచి ఆమె చాలా ఇండిపెండెంట్ గా ఉండాలని కోరుకునే లావణ్య పెళ్ళి తర్వాత కూడా ఇండిపెండెంట్ గా ఉంటానని చెప్పిందట. లావణ్య పెళ్లి తర్వాత సినిమాలు మానేసిన ప్రొడక్షన్ వైపు వెళ్తానని కండిషన్ పెట్టగా వరుణ్ తేజ్ కూడా అందుకు అంగీకరించాడని తెలుస్తోంది. అంతే కాకుండా తనకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టమని.. స్టేజ్.. షోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానని ఆ విషయంలో కండిషన్స్ పెట్టకూడదని చెప్పటంతో వరుణ్ కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం.


































