లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోన్లలో ఒకరు. 2012లో ‘అందాల రాక్షసి’తో తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ ఇప్పటి వరకు 16కి పైగా చిత్రాల్లో నటించింది.

లావణ్యకు భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. అటు స్టార్ హీరో నాగార్జునతో కూడా నటించిన విషయం తెలిసిందే. ఇలా తెలుగింటి ఆడపడుచులాగా ఉండే లావణ్య ఇటీవల కొత్త కొత్తల లుక్ లతో తన ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలను షేర్ చేస్తోంది.
స్కిన్ షోకి తెరలేపుతూ ఎలాంటి పాత్రకైనా సిద్దమే అన్న సందేశాన్ని దర్శక నిర్మాతలకు పంపుతుంది. గ్లామర్ ను పెంచి తను కూడా ఏ పాత్రనైనా చేయడానికి రెడీగా ఉన్నానని.. దానికి సంకేతంగానే హాట్ హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తున్నారు.
తాజాగా కారు అద్ధం చాటు నుండి అందాలను ఆరబోస్తూ కవ్విస్తోన్న ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమెలో కొత్త యాంగిల్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. పర్ఫెక్ట్ గా క్లిక్ చేసిన షాట్స్ లో లావణ్య హాట్ నెస్ తో పిచ్చెక్కించేలా ఉంది. లావణ్యకు సంబంధించి ఈ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.































