నెలకు రూ.500 కడితేచాలు… రూ.17 లక్షలు మీ సొంతం.. ఎలాగంటే?

0
277

డబ్బును సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఈ విధంగా తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో అధిక డబ్బును సంపాదించుకొనేవారికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. చాలామంది డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బిజినెస్ చేస్తుంటారు. అయితే బిజినెస్ లో కొన్ని సార్లు డబ్బులు రావచ్చు రాకపోవచ్చు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్ ద్వారా మనం దాచుకున్న డబ్బులకు అధిక మొత్తంలో రాబడిని పొందవచ్చు.

ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కేవలం నెలకు 500 రూపాయలను కడితే 30 ఏళ్ల తర్వాత ఏకంగా 17 లక్షలను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా నెలకు 500 నుంచి 1500 వందల వరకు పొదుపు చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్ ద్వారా వార్షిక రాబడి 12 శాతంగా పరిగణలోకి తీసుకుంటారు.ఈ విధంగా చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలంలో మంచి రాబడి పొందాలనుకునే వారికి ఇది ఎంతో మంచిది.

మ్యూచువల్ ఫండ్ ద్వారా మీరు సిప్ రూపంలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే లక్షలలో ఆదాయాన్ని పొందవచ్చు. నెలకు 500 రూపాయలను 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే 17 లక్షలను పొందవచ్చు. అదేవిధంగా నెలకు 1500 రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే 30 సంవత్సరాలకు 53 లక్షలను పొందవచ్చు ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఎలాంటి డోకా ఉండదు కనుక మీరు నిశ్చింతగా ఈ ఫండ్ ద్వారా డబ్బులను దాచుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here