దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో దేశంలోని పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ విధంగా కేసులు పెరగడానికి ప్రధాన కారణం ప్రజల నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. ప్రజలందరూ పూర్తిగా కరోనా జాగ్రత్తలను పాటించడం లేదు. ఈ క్రమంలోనే ఢిల్లీలో రోజురోజుకు కేసులు పెరగడంతో వారంతపు లాక్ డౌన్ కూడా విధించారు.

ఈ నేపథ్యంలోనే కరోనా నిబంధనలను ఉల్లంఘించి ఓ జంట కారులో షికారు కొట్టారు. ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ఫ్యూ పాస్ లేకుండా నిబంధనలు ఉల్లంఘించి కారులో వెళుతున్న జంటను పోలీసులు మాస్క్ పెట్టుకోలేదని ప్రశ్నించారు. దీంతో సదరు వ్యక్తి “నా కారు ఎందుకు ఆపారు”?నా కారులో నా భార్యతో లోపల ఉన్నాను అంటూ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే అతని భార్య పోలీసులపై ఎదురు దాడికి దిగుతూ ఇప్పుడు నా భర్తకు ముద్దిస్తా నన్ను ఆపుతావా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంతలోనే అక్కడకు ఒక మహిళా కానిస్టేబుల్ చేరుకొని ఆమెను సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ వ్యక్తి పంకజ్ దత్త అని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.త్వరలోనే అతని భార్య పై కూడా చర్యలు తీసుకోనున్నట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here