నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారతీయులు ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

0
154

ఈ ఏడాదిలో మే 26 అనగా నేడు మొట్టమొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ క్రమంలోనే ఆకాశంలో ఒక అద్భుతం జరగనుందని ఖగోళ శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆకాశంలో ఈ విధమైనటువంటి అద్భుతం 2019లో జరిగిందని తరువాత ఇప్పుడే ఇలాంటి అద్భుతం చోటు చేసుకుంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం నేడు ఏర్పడుతున్న క్రమంలో ఆకాశంలో ఈ అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ చంద్రగ్రహణం కారణంగా ఆకాశంలో చందమామ రెడ్ బ్లడ్ మూన్ గా కనువిందు చేయనున్నాడు. గ్రహణ సమయంలో చందమామ ఎరుపు నారింజ రంగులలో కనిపించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. గ్రహణం ఏర్పడుతున్న సమయంలో సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి అడ్డుగా రావడం వల్ల సూర్యకిరణాల్లోని ఎరుపు, నారింజ రంగు కిరణాలు… భూమి నుంచి ముందుకు దూసుకెళ్లి చంద్రునిపై ప్రసరించడం వల్ల చంద్రుడు ఎరుపు నారింజ రంగులు కనువిందు చేయనున్నాడు.

ఈ విధమైనటువంటి రెడ్ బ్లడ్ మూన్ 2019 వ సంవత్సరంలో ఏర్పడింది. తరువాత నేడు ఆకాశంలో కనువిందు చేయనుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎక్కువగా ఆసియా, ఆస్ట్రేలియా,పసిఫిక్ మహా సముద్ర దీవులు, ఉత్తర అమెరికాలో బాగా కనిపిస్తుంది. భారతదేశంలో చంద్రగ్రహణం పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.15కి ప్రారంభమయి 4.58 క్రమంగా తగ్గుతూ వస్తూ సాయంత్రం 6.23కి పూర్తిగా తొలగిపోతుంది.

ఈ గ్రహణ సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. గ్రహణం పడుతున్న సమయంలో ఎవరూ ఎటువంటి ఆహార పదార్థాలను తినకూడదు. ముఖ్యంగా మాంసాహారం తీసుకోకూడదు.అదేవిధంగా గ్రహణ సమయానికి ముందుగానే తులసి ఆకులను తెంపి మనం తీసుకునే ఆహార పదార్థాలలో వేయాలి. గ్రహణం పట్టిన సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులను తెంపకూడదు. అదేవిధంగా గ్రహణం పడుతున్న సమయంలో మన దేవుని గదిని పూర్తిగా కర్టెన్ వేసి ఉంచాలి .ఈ సమయంలో పొరపాటున దేవుని ఫోటోలను తాకరాదు. చిన్నపిల్లలు, గర్భం దాల్చిన మహిళలపై పొరపాటున ఈ చంద్రుని నీడ పడకుండా జాగ్రత్త పడాలి. చంద్రగ్రహణం పడుతున్న సమయంలో వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఉపవాసంతో ఉండటం ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here