మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఈ సారి హాట్ హాట్ గా సాగిపోతున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలో నిర్వహించే సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. నువ్వా.. నేనా అన్నట్టుగా అభ్యర్థుల మధ్య పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన సభ్యులు సోషల్ మీడియాలో.. మీడియా సమావేశాలలో బహిరంగా విమర్శలు చేసుకుంటున్నారు.

మా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం బరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అయితే మంచు విష్ణు ప్రకటించిన మా బిల్డింగ్ తను కట్టిస్తానని చెప్పిన దగ్గన నుంచి దాని చుట్టే ఎన్నికలు తిరుగుతున్నాయి.ఇదే ప్రధాన అంశంగా అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తమ ప్యానెల్ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు విష్ణు కూడా తమ ప్యానెల్ సభ్యులను ప్రకటించాడు. ఇందులో ఈసీ సభ్యులుగా 18 మందిని ప్రకటించాడు విష్ణు. మంచు విష్ణు ప్యానల్ లో.. అధ్యక్షుడిగా మంచు విష్ణు, ఉపాధ్యక్షుడిగా మాదల రవి, పృథ్వీరాజ్ ఉన్నారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్, ట్రెజరర్ గా శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీలు కరాటే కల్యాణి, గౌతమ్ రాజు లు ఉన్నట్లు ప్రకటించారు.
ఈసీ సభ్యుల్లో అర్చన, అశోక్‌కుమార్, గీతాసింగ్, హరినాథ్‌బాబు, జయవాణి, మలక్‌పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరీ రెడ్డి, సంపూర్ణేశ్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల, రేఖ ఉన్నారు. అయితే అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.






























