ప్రస్తుతం ఎక్కడ చూసినా రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడిన మాటలే వినిపిస్తున్నాయి. దీనిపైనే చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బాబూ మోహన్ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ తాజా కామెంట్స్ పై స్పందించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడింది ముమ్మటికి తప్పు అని.. పవన్ వ్యాఖ్యల వల్ల సినీ పరిశ్రమలో ఉన్న చాలామంది ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందన్నారు.

ఏమైనా సమస్యలు ఉంటే.. పెద్దలతో మాట్లాడి చర్చించుకోవాలి.. కానీ.. ఇలా బహిరంగంగా మాట్లాడితే.. ఇండస్ట్రీ పరవు పోతుందని.. సినీ నటులు అంటే.. అందరికీ చులకన భావం వస్తుందన్నారు. అతడు పరిశ్రమ సైడా..ప్రకాశ్ రాజ్ సైడా..? అంటూ మంచు విష్ణు అడిగిన ప్రశ్నకు అతడి నుంచి ఇంత వరకు సమాధానం రాలేదన్నారు. మొదట దీనిపై నీవు ఏ సైడు ఉంటావో తేల్చుకో అన్నారు.
నీకు నయా పైసా అన్యాయం జరగలేదు.. నీ రెమ్యూనరేషన్ నీకే ఉంది.. సినిమా చాన్స్ లు కూడా వస్తూనే ఉన్నాయి.. మరి ఎందకయ్యా అంత ఆవేశంగా మాట్లాడుతన్నావ్ అంటూ కౌంటర్ ఇచ్చాడు. పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను సినీ పెద్దలు ప్రభుత్వంతో మాట్లాడారని.. వారు కూడా సానుకూలంగా స్పందించారన్నారు.
పవన్ ఆవేశ పూరిత ప్రసంగం అనవసరం అన్నారు. సినీ పరిశ్రమ అనేది ముఖం లాంటిది అని.. ఏమైనా సమస్యలు ఉంటే తెరచాటున పరిష్కరించుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో బాబూమోహన్ వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా.. మా ఎన్నికలో బాబూమోహన్ విష్ణు ప్యానల్ నుండి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.






























