Madhavilatha: నచ్చావులే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి మాధవి లత. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం స్నేహితుడా సినిమాలో నటించారు. అలాగే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అయితే ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మాధవి లత ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వార్తలలో నిలుస్తుంటారు.

ఇలా ఈమె మరోవైపు బిజెపి పార్టీలో చేరి పెద్ద ఎత్తున రాజకీయాల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.ఇలా ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే మాధవి లత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ తాను ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను అంటూ ఓపెన్ అయ్యారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను ఒక వ్యక్తిని కలిశానని ముందు తనని అర్థం చేసుకోవాలని అనంతరం తన తల్లిదండ్రులకు నా తల్లిదండ్రుల అనుమతి పొందాలని అయితే ఇది అంత త్వరగా జరిగే విషయం కాదని మరొక ఏడాది పాటు ఎదురు చూడాలని తెలిపారు.అయితే పెళ్లి ఎప్పుడు అని మాత్రం ఎవరూ తనని అడగవద్దని వెల్లడించారు. అన్ని విషయాలు తానే అందరికీ చెబుతానని ఈమె తెలిపారు.

Madhavilatha తెలుగు వ్యక్తి మాత్రం కాదు…
ఇక తాను కలిసిన వ్యక్తి తెలుగు వ్యక్తి మాత్రం కాదని, నేను నా నమ్మకాలను గౌరవించే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఈ విషయంలో తగ్గేదే లేదు అంటూ ఈ సందర్భంగా మాధవి లత చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇలా ఈమె డేటింగ్ లో ఉన్నానంటూ తెలియ చేయడంతో ఈమె డేటింగ్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు.



























