Madhu Bala: తెలుగు తమిళ హిందీ భాషల్లో ఒకానొక సమయంలో అగ్రతారగా ఇండస్ట్రీలో వెలుగు వెలిగినటువంటి సీనియర్ తారాలలో మధుబాల ఒకరు.ఈమె ఇండస్ట్రీలో దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అతి తక్కువ సమయంలోనే మధుబాల ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె చాలాకాలం తర్వాత తిరిగి మరీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ మధుబాల ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె స్వీట్ కారం కాఫీ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మధుబాల మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తాను ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని తెలిపారు ఇలా బాలీవుడ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అనంతరం తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు.
ఇకపోతే ఒకానొక సమయంలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నటువంటి బాలీవుడ్ సినిమాలో తనకు హీరో తల్లి పాత్రలో నటించే అవకాశం కల్పించారు. ఇలా హీరోకి తల్లి పాత్ర అనగానే తాను ఈ సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు.తాను అజయ్ దేవగన్ ఇద్దరు ఓకే వయసు వాళ్లమే ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం అలాంటిది తనకు నేను తల్లిగా నటించడం ఏంటి అని తాను ఆ సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు.

Madhu Bala: హీరోలకు తల్లిగా చేయమన్నారు…
ఇక కొన్ని సంవత్సరాల తర్వాత తనకు ఇండస్ట్రీలో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు అందుకే ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలనుకున్నాను. అయితే ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలనుకోవడానికి కారణం ఏంటి అని ఆలోచించగా పెళ్లి కనిపించింది అందుకే తాను ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డాను. ఈ విషయాన్ని తెలిసినటువంటి వారందరికీ సినిమాలలో నటించనని లెటర్స్ రాసేసి ఇండస్ట్రీకి దూరమయ్యానని మధుబాల ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



































