Madhumitha: చందమామ,ఆర్య వంటి సినిమాలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందిన శివబాలాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుట్టింటికి రా చెల్లి సినిమా ద్వారా గుర్తింపు పొందిన మధుమితని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరిద్దరూ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

మధుమిత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి సంబంధించిన విషయాలను అభిమానులకు పంచుకుంటూ ఉంటుంది.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట వారి ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలతో పాటు వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలో శివ బాలాజీ మాట్లాడుతూ.. తండ్రి వ్యాపారవేత్త అయినప్పటికి నటన మీద ఉన్న ఆసక్తి వల్ల ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపాడు. అయితే తండ్రి మరణించిన తర్వాత బిజినెస్ చూసుకునేవారు లేక వ్యాపారంలో నష్టం రావడంతో తను సినిమాలకు దూరమై తన తండ్రి బిజినెస్ లు చూసుకోవడానికి వెళ్లానని తెలిపాడు. అయితే తన వల్ల కూడా వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చాయని, అందువల్ల వ్యాపారాలకు దూరమైనట్లు చెప్పుకొచ్చాడు.

Madhumitha: ఎగ్జామ్స్ ఉన్నా పిల్లలను రానివ్వలేదు…
ఇక ఈ క్రమంలో పిల్లల స్కూల్ వ్యవహారం గురించి ప్రస్తావన రాగా మధుమిత ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ” లాక్ డౌన్ సమయంలో స్కూల్ ఫీజుల గురించి ఒక జీవో వచ్చింది. కానీ నా పిల్లలు చదివే స్కూల్లో అంతకన్నా ఎక్కువ ఫీజులు వసూలు చేశారు. ఈ విషయం గురించి విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒకసారి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం మంచిదని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయటంతో వారు ధర్నాని విరమించుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన స్కూలు యాజమాన్యం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా పిల్లలను స్కూల్ నుండి తొలగించింది. మొత్తం ఫీజు చెల్లించినా కూడా వారం రోజుల్లో ఎగ్జామ్స్ ఉండగా పిల్లల్ని స్కూలు నుండి తీసేసారు” అంటూ మధుమిత చెప్పుకొచ్చింది.