ముగ్గురు కుమార్తెలకు ఒకేసారి పెళ్లి జరిపించిన సీఎం.. వీళ్ళు నిజంగా అదృష్టవంతులు?

0
659

సాధారణంగా ఎవరికైనా కూతురు పుడితే వారికి పెళ్ళి చేసి ఒక ఇంటికి పంపించాలి. తాజాగా ఒకే వేదికపై తన ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి సాగనంపారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అవును మహా రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన దత్త పుత్రికల వివాహం ఎంతో వైభవంగా జరిపించారు. వారి కూతుర్లకు సరైన అల్లుళ్లను వెతికి వారికి భారీగా కట్నకానుకలు ఇచ్చి తండ్రిగా తన బాధ్యతలను నెరవేర్చుకున్నట్లు మహారాష్ట్ర సీఎం తెలిపారు.

మధ్యప్రదేశ్ విదిషా పట్టణంలో ఉన్నటువంటి గణేష్ ఆలయంలో తన కూతుళ్ల పెళ్లి జరిపించారు. శివరాజ్ సింగ్, సాధన దంపతులు 20 సంవత్సరాల క్రితం ఏడుగురు ఆడ పిల్లలు ఇద్దరు మగ పిల్లలను దత్తత తీసుకుని వారికి ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేశారు. ఇప్పటికే నలుగురు కూతుళ్లు ఒక అబ్బాయికి పెళ్లి చేశారు. తాజాగా మిగిలిన ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి తన బాధ్యతను నెరవేర్చుకున్న ట్లు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

శివరాజ్ సింగ్ భార్య సాధన అశ్వాలపై వచ్చిన పెళ్లికుమారులకు తిలకం దిద్ది స్వాగతించారు.వీరి ముగ్గురికి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తున్న సమయంలో శివరాజ్ సింగ్ దంపతులు ఎంతో బావోద్వేగ మయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భావోద్వేగమైన ట్వీట్ చేశారు. ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. తండ్రిగా నా బాధ్యతలను నిర్వర్తించారు. కన్యాదానం చేయడం ఎలాంటి తండ్రికి అయినా ఒక గొప్ప విషయం… నా కూతుర్లకు జీవితంలో ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా ఉండాలనీ కోరుకుంటున్నాను అంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

ఈ క్రమంలోనే తన దత్తత పత్రికల వివాహం సందర్భంగా ముఖ్యమంత్రి తన ఇంటి ఆవరణంలో మూడు చెట్లను నాటారు. భవిష్యత్తులో ఆ చెట్ల నీడలో కూర్చుని తన కూతురుతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గడుపుతానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here