భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని పక్కింటి మహిళపై కక్ష పెంచుకుంది.. చివరకు దారుణానికి పాల్పడింది..

0
240

వివాహేతర సంబంధాల వల్ల కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. వారిపైనే ఆధారపడి జీవిస్తున్న పిల్లలు, కుబుంబసభ్యులను అనాథలను చేసి ఈ లోకాన్ని విడిచి పోతున్నారు. క్షణికావేశంలో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. పక్కింటి మహిళ లేదా పురుషుడి వ్యామోహంలో పడి కట్టుకున్న భాగస్వామికి ద్రోహం చేసి.. ఈ సమాజానికి తలవంపు తెస్తున్నారు.

ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హోసంగాబాద్ పట్టణంలో కణ్హే గ్రామంలో పింకీ మరియు ఆమె భర్త నివసిస్తున్నారు. అందులో భర్త రోజూ ఓ మహిళతో మాట్లాడుతుండటం భార్య గమనించింది. ఇలా తన భర్తతో పక్కింటి మహిళ సంగీతతో మాట్లాడటాన్ని చూసి ఆమె తట్టుకోలేక పోయింది.

ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందేమోనని అనుమానం పెంచుకుంది. ఆ అనుమానంతోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకునేది. రోజూ ఏదో చిన్న చిన్న గొడవలు పెట్టుకునే వారు. దీంతో ఆమె ఓ రోజు దారుణానికి ఒడిగట్టింది. ఓ రోజు సంగీత ఆమె ఇద్దరు పిల్లలతో ఆమె కూరగాయల మార్కెట్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అది గమనించిన పింకీ .. తన భర్తతో ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ నిలదీసింది.

దీంతో గొడవ మళ్లీ మొదలైంది. ఆ గొడవలో ఆమె పక్కనే ఉన్న ఓ బావిలో ఆ ఇద్దరు చిన్నారులనే తోసి.. సంగీతను కూడా అందులో పడేసింది. దీంతో ఆమె అక్కడ నుంచి పారిపోయింది. స్థానికుల సమచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఆమె కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.