దాదాపు సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి యావత్ ప్రపంచం మొత్తం విస్తరించడంతో ప్రజలందరూ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు.మార్కెట్ కి వెళ్లి ఏదైనా కొనాలంటే డబ్బులు మారడం ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని డబ్బులను కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా లావాదేవీలను జరుపుతున్నారు. ప్రస్తుతం చేతిలో డబ్బులు లేకుండా కూడా కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా కావాల్సినవన్నీ కొనుక్కోవడం అలవాటుగా మారిపోయింది. ఈ విధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎంతగా అభివృద్ధి చెందింది అంటే చివరికి పెళ్లిలో కట్నకానుకలు సైతం డిజిట‌లైజ్ అయిపోయాయి. తాజాగా తమిళనాడుకు చెందిన పెళ్లి పత్రికలు కట్న కానుకలను డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడానికి పెళ్లి పత్రికల పై క్యూఆర్ కోడ్ వేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

త‌మిళ‌నాడులోని మ‌ధురైలో ఓ కుటుంబం వెరైటీ పెళ్లి ప‌త్రిక‌ను ముద్రించింది.సాధారణంగా పెళ్లికి ఆహ్వానిస్తే ఆ పెళ్లికి వెళ్లి వధూవరులకు తమకు తోచినంత బహుమతులను, నగదును కానుకలుగా చెల్లిస్తుంటారు. కానీ ఈ పెళ్లి లో మాత్రం వివాహ పత్రిక పై క్యూఆర్ కోడ్ ని ముద్రించి బంధువులందరికీ ఆహ్వాన పత్రికలను అందజేశారు. పెళ్లికి రావడం కుదరనివారు, పెళ్లికి వచ్చిన అతిథులు సైతం ఈ క్యూఆర్ కోడ్ ద్వారా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి నగదును ట్రాన్స్ఫర్ చేసే అవకాశాన్ని కల్పించారు.

ఆదివారం జరిగిన ఈ వివాహ వేడుకకు వచ్చిన అతిధులు క్యూఆర్ కోడ్ ద్వారా 30 మంది అతిథులు వివాహ కానుకగా నగదు ఇవ్వడానికి ఈ క్యూఆర్ కోడ్ ను వినియోగించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విధంగా కూడా పెళ్లిలో కానుకలను సమర్పించుకునే అవకాశం కల్పించడం పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి ఇలాంటి సదుపాయాలు మరికొన్ని వేడుకలలో కూడా అందుబాటులో ఉంటాయని సదరు నెటిజన్లు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here