Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన ఒకానొక సమయంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారని తెలుస్తుంది.

మహేష్ బాబు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే మైగ్రేన్ తలనొప్పితో బాధపడ్డారట.ఈ తలనొప్పి కారణంగా మహేష్ ఎంతో నరకం అనుభవించారని ఈ వ్యాధి నుంచి బయటపడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన వీలుకాకుండా పోయిందని తెలుస్తోంది. అయితే ఈ విషయాలన్నింటినీ మహేష్ ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించారు.
దాదాపు కొన్ని నెలల పాటు మైగ్రేన్ తలనొప్పి సమస్యతో తాను చాలా బాధపడ్డానని తెలిపారు. రోజుకు ఆరేడు గంటల పాటు ఈ తలనొప్పి సమస్య తనని వెంటాడేదని మహేష్ వెల్లడించారు. ఎంతోమంది డాక్టర్లను కలిసిన ఎన్నో పెయిన్ కిల్లర్స్ వాడిన నొప్పి మాత్రం అసలు తగ్గలేదని దాంతో నరకం అనుభవించానని తెలిపారు.

Mahesh Babu: చక్ర సిద్ధ నాడి వైద్యం…
ఇలా మైగ్రేన్ తలనొప్పితో నేను పడుతున్నటువంటి బాధను చూసిన నమ్రత తన ఫ్రెండ్ ద్వారా డాక్టర్ సత్య సింధుజను కలిసి చక్ర సిద్ధ నాడి వైద్యం చేయించారని తెలిపారు. ఇలా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తనకు ఈ మైగ్రేన్ తలనొప్పి నుంచి చాలా తొందరగా ఉపశమనం కలిగిందని అలా ఈ వ్యాధి నుంచి తాను బయటపడ్డాను అంటూ ఒకానొక సందర్భంలో మహేష్ బాబు తాను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి చెబుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.