Mahesh Babu: ప్రవేట్ పార్టీలో సందడి చేసిన మహేష్ బాబు… వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్!

0
75

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇలా సినిమా షూటింగ్ పనులలో మహేష్ బాబు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం విరామం దొరికిన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఇక సాధారణంగా మహేష్ బాబు బయట పార్టీలకు పెద్దగా అటెండ్ అవ్వరు కేవలం సన్నిహితుల పార్టీలకు మాత్రమే వస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ఒక పార్టీలో సందడి చేశారని తెలుస్తుంది.

ఉపాసన కజిన్ సిస్టర్ శ్రియ భూపాల్ గురించి అందరికీ తెలిసిందే.ఈమె అఖిల్ తో నిశ్చితార్థం చేసుకుని అనంతరం బ్రేకప్ చెప్పుకొని మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇక శ్రీయ భూపాల్ బేబీ షవర్ వేడుకలలో భాగంగా మహేష్ బాబు నమ్రత అలాగే కూతురు సితార పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu: తండ్రిలాగే అల్లరి చేస్తుంది…


బేబీ షవర్ వేడుకలలో భాగంగా మహేష్ బాబు బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని చెప్పాలి. ఈ ఫోటోలను షేర్ చేసిన మహేష్ వాట్ ఏ ఫన్ నైట్ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ఇక నమ్రత సైతం ఇదే ఫోటోలను షేర్ చేస్తూ చాలా రోజుల తర్వాత ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకున్నామని చాలా సంతోషంగా పార్టీ జరిగిందని తెలిపారు. ఇక మొదటిసారి తన కుమార్తెతో కలిసి పార్టీకి వెళ్లానని తను కూడా తన తండ్రి లాగే చాలా అల్లరి చేస్తుంది అంటూ నమ్రత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.