Actress Namratha : అంజి సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నమ్రత. సూపర్ స్టార్ మహేష్ బాబుతో వివాహానంతరం సినిమా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి భర్త పిల్లలతో సమయం గడుపుతూ ఒక ఇంటి గృహిణిల ఉంటుంది. అలానే మహేష్ బాబు వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా ఉంటారు నమ్రత.

కాగా నమ్రత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ మహేష్ బాబు అప్డేట్ లను, తమ వ్యక్తిగత, వెకేషన్స్ వంటి ఫొటోస్ ను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా నమ్రత పుట్టిన రోజు జరిగింది. తన పుట్టిన రోజును కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు నమ్రత. ఈ సందర్భంగా తన పిల్లల ఫోటోను షేర్ చేశారు సూపర్ స్టార్ సతీమణి.

ఈ సందర్భంగా ఒక ఫోటోకి ‘ప్రతి రోజు.. పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు’ అంటూ తన ఇద్దరు పిల్లలపై ఉన్నప్రేమను మరోసారి పంచుకున్నారు నమ్రత. ఇప్పుడు నమ్రత షేర్ చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. క్షణాల్లో ఈ పోస్ట్ కు లైకులు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
నమ్రత పెట్టిన ఆ పోస్ట్ కు లైకులు వర్షం కురిపిస్తున్న నెటిజన్లు…
ప్రస్తుతం మహేష్ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే మహేష్ మోకాలికి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అలానే కరోనా బారిన కూడా పడ్డాడు మహేష్. వాటన్నిటి నుండి కోలుకొని ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షెడ్యూల్స్ లో బిజీ అయ్యారు మహేష్. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, రాజమౌళితో సినిమాలు చేయనున్నారు.

































