Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగడమే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలాంటి సూపర్ స్టార్ డమ్ ఉన్న మహేష్ బాబు తన స్టార్ డమ్ పక్కన పెట్టి ఒక సాధారణ వ్యక్తిలా సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహేష్ బాబు ఏంటి క్యూలో నిలబడడం ఏంటి అనీ ఆశ్చర్యపోతున్నారా..ఆయనకు సొంతంగా మల్టీప్లెక్స్ ఉన్నప్పటికీ ఇలా నిలబడటానికి కూడా ఒక కారణం ఉంది. మహేష్ బాబు నిర్మాతగా మేజర్ సినిమా నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు రంగంలోకి దిగారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా యూట్యూబర్,
డిజిటల్ క్రియేటర్ అయిన నిహారిక ఎన్ఎమ్ కలిసి ఒక వీడియోని చేశారు. ఈ వీడియోలో భాగంగా నిహారిక థియేటర్ వద్ద క్యూలో ఉన్న వారి దగ్గరకు వెళ్లి ఇది మేజర్ సినిమా లైనేనా అని ప్రశ్నిస్తుంది. అవునని చెప్పడంతో ఆమె టికెట్ల కోసం క్యూలో నిలబడి ఉంది. అనంతరం అడవి శేషు వచ్చి తన ముందు నిలబడగా నిహారిక తనతో గొడవ పడుతుంది. తాను లైన్లో నిలబడ్డానని తనని తోసుకుంటూ వెళ్లడం ఏంటి అని ప్రశ్నించగా అడవి శేష్ వెనక్కి వెళ్లి నిలబడతాడు.
ప్రమోషన్ కార్యక్రమాలలో మహేష్…
ఆ సమయంలోనే మరొక వ్యక్తి తన ముందు వచ్చి నిలబడ్డాడు. ఆమె తనని కూడా తిట్టడానికి ప్రయత్నించగా, అక్కడ మహేష్ బాబు ఉండటం చూసి ఆశ్చర్య పోయి సైలెంట్ అవుతుంది.అదే సమయంలోనే మహేష్ బాబు తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు పిలవచ్చా అని అడగగా అందుకు నిహారిక పిలవండి అంటూ సమాధానం చెబుతుంది.ఈ క్రమంలోనే నిహారిక తన ఫోన్ నెంబర్ అడగాలని ప్రయత్నిస్తే మహేష్ బాబు అక్కడి నుంచి టిక్కెట్ కౌంటర్ వద్దకు వెళతారు. అది చూసిన అడవి శేష్ నా నెంబర్ కావాలా తీసుకో అంటూ తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వీరు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Queues are so much fun with @AdiviSesh and @urstrulyMahesh 🙂#MajorTheFilm #MajorOnJune3rd #Adivisesh #MaheshBabu𓃵 pic.twitter.com/lsUk0tRs9F
— Niharika Nm (@JustNiharikaNm) May 29, 2022