హైదరాబాద్: సనత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ఒక ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ తయారీకి సంబంధించిన ఈ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం, ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీగా వ్యాపించిన మంటల కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
సనత్ నగర్‌లో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
— TeluguDesk (@telugudesk) July 17, 2025
సనత్ నగర్ పరిశ్రమ వాడలోని పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా ఎగిసిపడుతున్న వేళ సంఘటనా స్థలానికి 5 ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఘటనపై… pic.twitter.com/yv3sRJt8hv


























