తాజాగా జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీకి ఎదురొడ్డి నిలిచి సరికొత్త ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో బిజేపీ అగ్రనాయకత్వం అంతా దిగివచ్చి ప్రచారం చేసినా ఫలితాలు మాత్రం బిజేపీకి ఆశించిన మేర అందుకోలేకపోయింది. టీఎంసీ, బిజేపీ ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ రసవత్తర పోరులో 213 స్థానాలను దక్కించుకొని అదిరిపోయే విజయం అందుకొంది. ఈ ఎన్నికల్లో వీల్‌ చైర్‌ నుంచే చక్రం తిప్పారు దీదీ..

ముఖ్యంగా ‘దీదీ.. ఓ దీదీ.. నీతో పాటు నీ పార్టీని కూడా బెంగాల్ ప్రజలు సాగనంపుతారు’ అంటూ ఎద్దేవ చేసిన ప్రధాని మోదీని తిరుగులేని దెబ్బ కొట్టారు. తాజగా టీఎంసీ అద్భుత విజయంతొ దీదీ మమతా బెనర్జీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపధ్యంలో 1980 నాటి మమతా బెనర్జీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here