బట్టతల విషయాన్నీ దాచి పెళ్లి చేసుకున్నాడు… భార్య ఊహించని శిక్ష?

0
493

సాధారణంగా ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూసి పెళ్ళి నిశ్చయించుకుంటారు. అలాగే అబ్బాయిల విషయంలో అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అతని గురించి విచారణ చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. అలా పెళ్లి చేసుకున్న ఓ జంట పెళ్లి చూపులప్పుడు పెళ్ళికొడుకు తనకు బట్టతల ఉందన్న విషయం దాచి పెళ్లి చేసుకోవడం వల్ల అతనిపై పరువునష్టం కేసు వేయడం తాజాగా ముంబై నగరంలో చోటు చేసుకుంది.

ముంబై నగరంలోని మీరా రోడ్లో నివాసముండే 29 ఏళ్ల వ్యక్తి నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ వ్యక్తి గత నెల క్రితం చార్టెడ్ అకౌంట్ గా ఉద్యోగం చేసే 27ఏళ్ల మహిళతో వివాహం జరిపించారు. ఆ వ్యక్తికి బట్టతల ఉండడంతో గత కొద్ది సంవత్సరాల నుంచి విగ్గును పెట్టుకొని మేనేజ్ చేస్తూ వచ్చాడు. అదేవిధంగా తన పెళ్లి చూపులప్పుడు కూడా తనకు బట్టతల ఉన్న విషయం అమ్మాయి వారితో చెప్పకుండా వివాహం జరిపించారు. వివాహమైన కొద్ది రోజులకు అసలు విషయం బయటపడడంతో తన భార్య మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని ఆరోపించింది.

అబ్బాయిలకు బట్టతల ఉండడం సర్వసాధారణమేనని అబ్బాయి తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఆమె వినకుండా, నయా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్న భర్త పై తగిన చర్యలు తీసుకోవాలని, అతడికి సహకరించిన తన తల్లిదండ్రుల పై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బట్టతల ఉందన్న విషయం ముందుగా తెలిసి ఉంటే పెళ్ళికి అంగీకరించేది కాదని బాధిత మహిళ పోలీసుల దగ్గర తన గోడును వెల్లడించింది. మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నందుకు గాను పరువు నష్టం కింద తన భర్త, అత్త,మామల పై కేసు నమోదు చేశారు.