ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాటోలీ ఎస్బీఐ బ్రాంచ్ లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక యువతి పింఛను కోసం తండ్రిని మూడుసార్లు చంపేసింది. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటనలో వాస్తవాలు తెలిసి బ్యాంకు అధికారులే ఖంగు తిన్నారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల కోసం ఒక యువతి ఒక వ్యక్తికి సంబంధించిన మూడు డెత్ సర్టిఫికెట్లను చూపించింది. అనుమానం వచ్చి అధికారులు ఆరా తీయగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని గ్వాటోలీ బ్రాంచ్ లో మహమ్మద్ హలీమ్ అనే వ్యక్తి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ వ్యక్తి తండ్రి పేరు మహబూబ్ అలీ అని ఆ వ్యక్తి మకరాబర్ట్ గంజ్ కు చెందిన వ్యక్తి అని ఉంది. 2001 సంవత్సరం జూన్ నెలలో గ్వాటోలీ బ్రాంచ్ లో ఈ బ్యాంక్ అకౌంట్ ను తెరిచారు. 2011 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ బ్యాంక్ అకౌంట్ లో చివరగా లావాదేవీలు జరిగాయి.

ప్రతి సంవత్సరం ఈ అకౌంట్ లో పింఛన్ తో పాటు వడ్డీ జమవుతోంది. అయితే రెండు రోజుల క్రితం అర్షాఖాన్ అనే యువతి మూడేళ్ల క్రితం మహమ్మద్ హలీమ్ మృతి చెందాడని డెత్ సర్టిఫికెట్ ను అందజేసి అవసరమైన ఫారాలను కూడా ఆమె నింపింది. అయితే డెత్ సర్టిఫికెట్ లో 2011లో మహమ్మద్ హలీమ్ మృతి చెందినట్టు ఉండటంతో బ్యాంకు అధికారులకు అసలేం జరుగుతుందో అర్థం కాలేదు.

మొదట 2017 డెత్ సర్టిఫికెట్ ను చూపించిన యువతి ఆ తరువాత 2011 డెత్ సర్టిఫికెట్ ను చూపించింది. బ్యాంక్ అధికారులు ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ చూపించాలని కోరగా యువతి ఆ తరువాత 2018 డెత్ సర్టిఫికెట్ ను చూపించింది. ఒకే యువతి మూడు డెత్ సర్టిఫికెట్లను చూపించడంతో విచారణ చేసిన అధికారులకు యువతి ఆ వ్యక్తి కూతురు కాదని అర్థమైంది. బ్యాంక్ ఉన్నతాధికారులు ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here