సాధారణంగా ఒక మనిషి చనిపోతే అతను చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాతనే అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తాము. చనిపోయిన తరువాత అంత్యక్రియలు నిర్వహించిన వ్యక్తి తిరిగి రావడం అనేది మనం కేవలం సినిమాలలో మాత్రమే చూస్తాము. నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు కలలో కూడా జరగవు.కానీ ఓ వ్యక్తి మాత్రం చనిపోయాడని భావించి అంత్యక్రియలు జరిపిన 24 సంవత్సరాలకు రావడంతో కుటుంబ సభ్యులు ఎంతో ఆశ్చర్యపోయారు. అసలు చనిపోయిన వ్యక్తి రావడం ఏంటి? అది కూడా 24 సంవత్సరాల తర్వాత అసలు ఏం జరిగింది? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లా రాణిఖేత్ ప్రాంతానికి చెందిన మాదో సింగ్ మెహ్రా అనే వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అతని కోసం కుటుంబ సభ్యులు వెతకని చోటు లేదు.ఈ క్రమంలోనే అతడు కనిపించకపోయే సరికి అతను మరణించి ఉంటాడని భావించిన కుటుంబ సభ్యులు అతని ఫోటోకు దండ వేసి అంత్యక్రియలు జరిపారు.
ఈ విధంగా అంత్యక్రియలు జరిపిన 24 సంవత్సరాల తరువాత అతను ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఎంతో ఆశ్చర్యపోయారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అతని ఇంటిలోకి కాలు పెట్టిన ఇవ్వలేదు.మెహ్రా కొన్ని సంవత్సరాల నుంచి కనపడకపోవడంతో చనిపోయాడని అంత్యక్రియలు జరిపించారు.కనుక అతడు ఇంటిలోకి రావాలంటే తిరిగి అతడు జన్మించాడని భావించి అతనికి నామకరణం చేసి ఇంటిలోకి పిలుచుకోవాలని పండితులు చెప్పడంతో అతని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లో ఉంచారు.
ఈ క్రమంలోనే మెహ్రా అల్లుడు మాట్లాడుతూ… నా చిన్న వయసులో మా మామయ్య తప్పిపోయారు. అతని కోసం చాలాచోట్ల వెతికాము అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ క్రమంలోనే మామయ్య జాతకం పండితులకు చూపించడంతో అతను బతికి ఉండే అవకాశాలు లేవని చెప్పడంతో మా కుటుంబ సభ్యులు మామయ్య ఫోటోకు దండ వేసి అంత్యక్రియలు నిర్వహించారు.అంత్యక్రియలు నిర్వహించిన 24 సంవత్సరాలు అతను తిరిగి వచ్చారని తెలిపారు.






























