Manchu Lakshmi -Manoj: మంచు రియాలిటీ షో నిజం కాదా… కవర్ చేయడానికి విష్ణు తంటాలు పడుతున్నారా?

0
112

Manchu Lakshmi -Manoj: మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ వార్తలకు అనుకూలంగానే వీరిద్దరూ మనోజ్ అనుచరుడు ఇంటిలో పెద్ద ఎత్తున గొడవకు దిగిన వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ విషయం సంచలనంగా మారింది. ఇక ఈ విషయంపై మోహన్ బాబు సీరియస్ కావడంతో గొడవ సర్దుమనిగిందని తెలుస్తుంది.

ఇకపోతే ఇది నిజమైన గొడవ కాదని మంచూస్ రియాలిటీ షోలో భాగంగా చేసింది అంటూ విష్ణు మరొక వీడియోని షేర్ చేశారు.దీంతో అందరూ ఆశ్చర్యపోయారు అసలు రియాలిటీ షో ఏంటి ఇలా గొడవ పడడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియోని మంచు లక్ష్మి మనోజ్ మాత్రం షేర్ చేయకపోవడంతో సరికొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలోని ఈ విషయం గురించి లక్ష్మీ ప్రసన్నను ప్రశ్నించగా తాను ఎలాంటి రియాలిటీ షో లలో చేయలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇక మనోజ్ టీం కూడా ఈ వార్తలను తోసిపుచ్చింది.మనోజ్ ఎలాంటి రియాల్టీ షోలలో నటించలేదని ఆరోజు సారథి భార్య ఫోన్ చేయడంతోనే తన ఇంటికి వెళ్లారు తప్ప తను ఎలాంటి షోలలో చేయలేదని తెలిపారు.

Manchu Lakshmi -Manoj: గొడవను కవర్ చేయడానికేనా…

ప్రస్తుతం మనోజ్ తన సినిమాలు తన వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్నారని మనోజ్ టీం వెల్లడించారు.మరి ఇదంతా చూస్తుంటే విష్ణు ఆరోజు చేసిన గొడవను కప్పిపుచ్చుకోవడానికి ఇలా రియాలిటీ షో అంటూ మరొక వీడియోని షేర్ చేశారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.