Manchu Manoj:మంచు మనోజ్ పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన మనోజ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన వ్యక్తిగత విషయాల వల్ల గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన మొదటి భార్య ప్రణతికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వార్తలు ఊపందుకున్నాయి.

ఈ క్రమంలోనే ఈయన తాజాగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నా జీవితానికి ముఖ్యమైన విషయాన్ని చాలాకాలంగా నా గుండెల్లోనే దాచుకున్నాను. నా జీవితం మరో దశలోకి అడుగుపెడుతున్న తరుణంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను.నాకు ఇంతటి సంతోషాన్ని కలిగించిన ఆ వార్త ఏంటి అనే విషయాన్ని జనవరి 20వ తేదీ ప్రకటిస్తానని ట్వీట్ చేశారు.
ఎప్పటిలాగే నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా పలు చర్చలకు కారణం అవుతుంది.అయితే ఈయన జనవరి 20వ తేదీ తన సినిమా గురించి ప్రకటిస్తాడా లేక తన రెండవ పెళ్లి గురించి ప్రకటిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Manchu Manoj: రెండో పెళ్లి గురించి ప్రకటించబోతున్న మనోజ్…
మంచు మనోజ్ గత కొంతకాలంగా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనికతో ఈయన రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి మంచు మనోజ్ ను నేరుగా ప్రశ్నించగా మంచి సమయం చూసుకొని ఈ విషయాన్ని తెలియజేస్తానని వెల్లడించారు. అయితే జనవరి 20వ తేదీ మనోజ్ తన రెండో పెళ్లి గురించి ప్రకటించబోతున్నారంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.































