పెద్ద మనస్సు చాటుకున్న మంచు మనోజ్.. మరో సోనూసూద్ అంటూ ప్రశంసలు..?

0
156

మంచు మోహన్ బాబు తనయుడు, నటుడు మంచు మనోజ్ గొప్ప మనస్సు చాటుకున్నారు. బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న బాబుకు తన వంతు సహాయం అందించడానికి అండగా నిలిచారు. బాబు వైద్యానికి కావాల్సిన సహాయం తాను తప్పకుండా చేస్తానని కీలక ప్రకటన చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఒక నెటిజన్ ఒక బాబు బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నాడని ఆ బాలుడి వైద్యానికి సరిపోయేంత డబ్బు తల్లిదండ్రుల దగ్గర లేదని ట్వీట్ చేశాడు.

ఆ బాలుడి తగిన వైద్య సహాయం అందేలా చేయాలని కోరుతూ సోనూసూద్, నందమూరి ఫ్యాన్స్ తో పాటు, మంచు మనోజ్, మరి కొందరిని నెటిజన్ ట్యాగ్ చేశాడు. ఆ ట్వీట్ తన దృష్టికి రావడంతో మంచు మనోజ్ స్పందించి బాలుడి వైద్యానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. నెటిజన్ చేసిన ట్వీట్ లో మనోహర్ బాబు అనే వ్యక్తి తాను వృత్తిరిత్యా ఆటోడ్రైవర్ నని తన కొడుకు బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నాడని సహాయం చేయాలని కోరాడు.

మంచు మనోజ్ తన ఇన్ బాక్స్ కు బాలుడు చికిత్స చేయించుకుంటున్న ఆస్పత్రి పేరు, వైద్యుల పేర్లు పంపాలని.. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. దీంతో నెటిజన్లు మంచు మనోజ్ ను ప్రశంసిస్తున్నారు. మరో సోనూసూద్ అంటూ రియల్ హీరో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సైతం మంచు మనోజ్ వలస కార్మికులకు తన వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ లో ఉన్న కార్మికులను మనోజ్ తన సొంత డబ్బులతో సొంతూళ్లకు తరలించారు. మనోజ్ అభిమానులు దైవం మనుషుల రూపంలోనే ఉంటాడని.. నిజంగా మీరు గ్రేట్ అంటూ మంచు మనోజ్ ను ప్రశంసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here