Manchu Manoj: మంచు మనోజ్ దివంగత నేత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక రెడ్డితో మార్చి మూడవ తేదీ ఏడడుగులు నడవబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఇక ఇప్పటికే వీరి కుటుంబంలో పెళ్లికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని మనోజ్ సన్నిహితుల సమాచారం. ఇక మనోజ్ రెండో పెళ్లి వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇలా మనోజ్ భూమా మౌనిక రెడ్డి పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న నేపథ్యంలో మనోజ్ తాజాగా మౌనికతో తనకున్నటువంటి పరిచయం గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ మౌనిక తనకు చాలా రోజుల నుంచి మంచి స్నేహితురాలని తెలిపారు. ఇలా మా మధ్య స్నేహబంధం ఉండగా క్రమక్రమంగా అది ప్రేమగా మారిందని తెలిపారు.
ఇక మౌనిక తనకు కష్ట సమయాలలో చాలా అండగా నిలిచారని అలాంటి మంచి మనసున్న అమ్మాయి నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం అంటూ మనోజ్ మౌనిక గురించి మొదటిసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Manchu Manoj: ఇద్దరికీ ఇది రెండవ వివాహం…
ఇక మనోజ్ మౌనిక రెడ్డితో ఉన్న స్నేహబంధంతో ఆయన మౌనిక రెడ్డి మొదటి వివాహానికి హాజరైన విషయం మనకు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇదివరకే పెళ్లి చేసుకున్న మౌనిక కొన్ని మనస్పర్ధలు కారణంగా తన భర్తకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నారు.మనోజ్ సైతం తన భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.































