Manchu Manoj -Vishnu: సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మంచు కుటుంబంలో గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఎంతో సన్నిహితంగా ఉండే అన్నదమ్ముల మధ్య ఏదో ఒక విషయం గురించి విభేదాలు చోటు చేసుకున్నాయని అందుకే మనోజ్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఇలా ఈ విభేదాల కారణంగానే మనోజ్ తన పెళ్లి లక్ష్మీ ఇంటిలో జరిగిందని తెలుస్తుంది. ఇక ఈ పెళ్లి వేడుకలలో మంచు కుటుంబం దూరంగా ఉన్నారు. ఏదో అతిథిలా వచ్చి అక్షింతలు వేసి వెళ్ళిపోయారు.ఇలా ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య జరిగినటువంటి ఈ వివాదం ఒక్కసారిగా బయటపడటంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ గొడవకు సంబంధించిన వీడియోని మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
విష్ణు తన కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే సారధి అనే వ్యక్తి గత కొంతకాలంగా మనోజ్ కి చాలా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విష్ణు సారథి ఇంట్లో మనోజ్ ఉండగా అక్కడికే వెళ్లి సారధి పై దాడి చేయగా ఆయన తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రికి వెళ్లారు.ఇక అక్కడే ఉన్నటువంటి మనోజ్ పై విష్ణు దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియోని మనోజ్ చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Manchu Manoj -Vishnu:విష్ణుని అడ్డుకున్న సారధి కుటుంబ సభ్యులు…
ఇందులో విష్ణు వాడేదో అంటున్నాడుగా అంటూ మనోజ్ పై దాడికి వెళుతూ ఉండగా సారధి కుటుంబ సభ్యులు తనని అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మనోజ్ ఇలా బంధువుల ఇళ్లపైకి వచ్చి కూడా దాడి చేస్తూ ఉంటాడు అంటూ ఈ వీడియోలో చెప్పారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారడంతో మంచు కుటుంబంలో జరుగుతున్నటువంటి విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయని తెలుస్తోంది. అయితే ఈ విభేదాలకు కారణం ఏంటో తెలియాల్సి ఉంది.































