అక్టోబర్ 10వ తేదీ జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడి పరస్పరం ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రకాష్ ప్యానెల్ కి మెగా కుటుంబం మద్దతుతో పాటు శ్రీకాంత్ వంటి స్టార్ హీరోల మద్దతు కూడా ఉంది.

మంచు విష్ణు ప్యానెల్ లో అవుట్ డేటెడ్ య్యాక్టర్లు ఉన్నారనే విమర్శలు కూడా వచ్చాయి. మంచు విష్ణు ప్యానెల్ లో ఒక నరేష్ మినహా మిగతా ఎవరు బలంగా లేరని తెలుస్తోంది. అయితే గత ఎన్నికలలో భాగంగా నరేష్ శివాజీ రాజా పై మెగా కుటుంబం మద్దతుతోనే గెలిచారు.అయితే ప్రస్తుతం మెగా కుటుంబం మద్దతు తెలుపుతున్న ప్రకాష్ రాజ్ కి కాకుండా మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నారు.
ఇకపోతే మా ఎన్నికలలో భాగంగా మంచు విష్ణుకు ఓటు వేయాలంటూ మోహన్ బాబు కోరారు. ఈ క్రమంలోనే మంచు విష్ణుకి మద్దతుగా మంచు మనోజ్ మద్దతు తెలపగా పోవడం గమనార్హం. మంచు మనోజ్ విష్ణు కేవలం మద్దతు తెలపకపోవడమే కాకుండా కనీసం మంచు విష్ణు ఓటు వేయాలని కూడా ఎవరిని అడుగక పోవటంతో వీరిద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా అంటూ సందేహాలు తలెత్తుతున్నాయి.
మంచు విష్ణుకు సొంత తమ్ముడు మద్దతు తెలపక పోవడంతో మంచు విష్ణుకు మా ఎన్నికల్లో మద్దతు కరువైందా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి అక్టోబర్ 10వ తేదీ జరిగే మా ఎన్నికలలో ఎవరు అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంటారో వేచి చూడాలి.































