టాలీవుడ్‌లో ప్రముఖ నటీనటులందరినీ కలుపుతూ ఓ వాట్సాప్ గ్రూప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 140 మంది యాక్టర్లు సభ్యులుగా ఉండగా, ఈ గ్రూప్‌ను రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ కలిసి ప్రారంభించినట్టు సమాచారం. సినిమా విశేషాలు, వ్యక్తిగత ప్రాజెక్టులపై అప్డేట్స్ వంటి విషయాలను ఈ గ్రూప్‌లో షేర్ చేసుకుంటుంటారు.

ఇటీవల కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఈ గ్రూప్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “ఆ గ్రూప్‌లో నేను కూడా ఒకప్పుడు ఉన్నాను. కానీ ఆ గ్రూప్‌లో చాలా మంది హీరోయిన్స్ ఉండడం వల్ల నాకు అక్కడ మాట్లాడటం సౌకర్యంగా అనిపించలేదు. అటువంటి వాటిలో నేను చురుకుగా భాగం కాకపోవడంతో, స్వచ్ఛందంగా ఆ గ్రూప్ నుంచి నిష్క్రమించాను” అని స్పష్టం చేశారు.
అలాగే, “నా తోటి నటులతో నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. ఏవైనా అవసరాలుంటే ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, అందరం కలసే మంతనాలు జరుపుకుంటాం” అని పేర్కొన్నారు. టాలీవుడ్ నటీనటుల మధ్య ఉన్న స్నేహపూరిత వాతావరణాన్ని ఈ వ్యాఖ్యలు హితంగా ప్రతిబింబిస్తున్నాయి.



































