Manjima Mohan: కోలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ పక్షులుగా విహరిస్తున్నటువంటి నటి మంజీమా గౌతమ్ కార్తీక్ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నటువంటి ఈ దంపతులు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో తెలియజేస్తూ కుటుంబ సభ్యుల సమక్షంలో నవంబర్ 28వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా తమ వివాహాన్ని చేసుకున్నారు.

ఈ క్రమంలోనే వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇకపోతే ఈ ఫోటోలు పట్ల కొందరు స్పందిస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు మాత్రం నటి మంజీమాను బాడీ షేమింగ్ చేస్తూ భారీగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మంజీమా తన బాడీ షేమింగ్ గురించి స్పందించారు.
ఈ సందర్భంగా మంజీమా మాట్లాడుతూ తనని కొందరు తన పెళ్లిలో భారీగా బాడీ షేమింగ్ చేశారంటూ బాధపడ్డారు.అయితే తనకి ఇలా మొదటిసారి కాదని ఇదివరకు కూడా చాలామంది తనని ట్రోల్ చేశారనీ చెప్పుకొచ్చారు.ఇకపోతే ప్రస్తుతం తన శరీరంతో తాను చాలా సౌకర్యంగా ఉన్నానని తనకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా శరీర బరువు తగ్గుతానని ఈమె చెప్పుకొచ్చారు.

Manjima Mohan: ఇకపై అలాంటి విషయాలను పట్టించుకోను..
ఇక తన శరీరం ప్రస్తుతం చాలా ఫీట్ గా ఉందని, ఇకపై తన గురించి ఇలాంటి వార్తలు వచ్చిన తాను ఏ మాత్రం పట్టించుకోదల్చుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు.ఇక పెళ్లి గురించి మరికొందరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ మేమిద్దరం డేటింగ్ లో ఉండి పెళ్లి చేసుకున్నామని అంటున్నారు. నిజానికి అది పూర్తిగా ఆ వాస్తవమని తాము ప్రేమించుకొని పెద్దలను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నామంటూ ఈమె పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.






























