అమ్మ అను మాట వింటే చాలు మనసు అంతా ఎంతో పరవశించిపోతుంది. ఆ పిలుపులోనే ఉంది వెలకట్టలేని సంపద. అమ్మ గురించి ఎన్ని మాటలు చెప్పిన, ఎన్ని సినిమాలు తీసినా గాని తక్కువే. అయితే మనకు ఎప్పుడు అమ్మ అనే మాట వినపడిన ముందుగా గుర్తుకు వచ్చే సినిమా మాతృ దేవో భవ సినిమా. ఏప్పుడు ఈ సినిమా చూసిన గాని కంటతడి పెట్టక మానరు. అంతలా మాధవి ఈ సినిమాలో లీనమై నటించారు. ఎప్పుడో 1993 లో విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు మనం చూస్తున్న గాని కంట కన్నీరు కారుతూ ఉంటుంది. సినిమా మాత్రమే కాదు, ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. తాను క్యాన్సర్ తో చనిపోతానని తెలిసి, తనపేగు తెంచుకుని పుట్టిన పిల్లలు అనాధలుగా మిగలకూడదని, వేరే వాళ్ళకి దత్తత ఇస్తుంది. ఈ క్రమంలోనే తన పిల్లలు తన దగ్గర నుండి దూరం అవుతుంటే ఆ తల్లి పడే బాధ అంతా ఇంతా కాదు.

అమ్మగా మాధవి నటించిన తీరు చూస్తే ఎవరయినా ముక్కు మీద వేలు వేసుకోవాలిసిందే. ఈ సినిమాలో నాన్న పాత్రలో నాజర్ నటించాడు. మొదట్లో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే అల్లరి చిల్లరి పాత్ర పోషించిన తరువాత తండ్రిగా తన బాధ్యత తెలుసుకుని మంచి నాన్నగా మారతాడు. ఇంకా ఈ సినిమాలో మాదవి, నాజర్ కి నలుగురు సంతానం. వాళ్ళు బేబీ సీన, మాస్టర్ మార్టిన్, మాస్టర్ ఫణి, మాస్టర్ తేజ. వీల్లేనండీ మాతృదేవో భవ సీనిమాలో నటించిన పిల్లలు. ఈ పిల్లలు నలుగురు కూడా తమ తమ నటనతో అందరిని మెప్పించి, ఏడిపించారు కూడా. అలాగే ఈ సినిమా తమిళంలో అక్షదూత అనే పేరుతో వచ్చింది. ఈ సినిమా వచ్చి ఇప్పటికే పాతిక సంవత్సరాలు అవుతుంది. అయితే అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్న పిల్లలు ఇప్పుడు పెద్ద అయిపోయారు కూడా. అయితే ఇప్పుడు ఆ పిల్లలు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

ఈ సినిమాలో ముందుగా రాధా పాత్రలో నటించిన బేబీ సీన గురించి చూస్తే.. సీన తమిళంలో అనేక సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాను రీమేక్ చేయగా ఆ సినిమాలో మమ్ముట్టి చెల్లెలిగా సీనా నటించింది. అలాగే తమిళ సీరియల్స్ లో బిజీ గా ఉన్న సీనాకు వివాహం కూడా జరిగింది. జాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉంది.

మాతృదేవో భవ సినిమాలో చివరికి వరకు తల్లిని విడవకుండా, తల్లితోనే ఉన్న కుర్రాడు మాస్టర్ మార్టిన్. అప్పట్లో మూడవ తరగతి చదివేవాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాల్లో కూడా నటించలేదు. మద్రాసు లయోలా కాలేజ్ లో ఇంజినీరింగ్ చదివి, సెటిల్ అయ్యాడు. 2017 లో పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యాడు. అంతేకాదు మార్టిన్ మంచి అందగాడు. హీరో అయ్యే లక్షణాలు ఉన్నాగాని, సినిమాల్లో ఆసక్తి లేదని స్పష్టంగా తెలిపాడు. ఇంకా మిగతా చైల్డ్ ఆర్టిస్టులు ఫణి అయితే ఆయన మళ్ళీ సినిమాల్లో నటించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here