వివాహేతర సంబంధాల కారణంగానే ప్రస్తుతం కాపురాలు కూలిపోతున్నాయి. భర్త లేదా భార్య పర స్త్రీ, పర పురుషుడి వ్యామోహంలో పడి బంగారం లాంటి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. పెళ్లి అనే బంధానికే మాయని మచ్చ తెస్తున్నారు. ఇలాంటి ఘటనలో ఓ వైద్యుడు తన ఆసుపత్రిలో పనిచేసే ఓ నర్సుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్యతో విడాకులు తీసుకొని ఆమె దగ్గర ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆమె విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో దారుణానికి పాల్పడ్డాడు.

ఇంతకు ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.. బిహార్ కు చెందిన ఓ వైద్యడికి 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఆపుపత్రిలో పనిచేసే నర్సు పై మోజులో పడిన సదరు వైద్యుడు తన భార్యను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు.
అనుకున్నట్లుగానే.. ఆమెతో విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ అతడి భార్య విడాకులు ఇవ్వడానికి ససేమిరా అన్నది. దీంతో అతడు ఎలాగైన విడాకులు తీసుకోవాలని.. ఘోరమైన చర్యకు పాల్పడ్డాడు. తన స్నేహితుడిని ఇంటికి తీసుకొచ్చి అతడితో సరసాలాడమంటూ ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది.
ఈ పనిచేస్తుండగా అతడు వీడియోలు, ఫొటోలు తీసి… వాటిని బంధువులుకు, కోర్టుకు చూపించి భార్య నుంచి విడాకులు తీసుకోవాలనేది అతడి ప్లాన్. ఆ పనికి ఆమె ఒప్పుకోకపోవడంతో బ్లేడుతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతులను, గొంతుపై బ్లేడ్ తో కోసేశాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకొని ఆ వైద్యుడిని, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.





























