Actress Meena: తెలుగు తమిళ సినిమాలలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన నటి మీనా జీవితంలో విషాదం చోటు చేసుకుంది. మీనా భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడిన విద్యాసాగర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఈయన అంత్యక్రియలు బుధవారం జరిగాయి.అయితే ఈ అంత్యక్రియలలో మీనా అన్ని తానే తన భర్త అంత్యక్రియలను దగ్గరుండి జరిపించారు.

మీనా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ జంట వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే కొంతకాలం నుంచి ఈయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు. అప్పటినుంచి విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందగా ఆయన అంత్యక్రియలను మీనా దగ్గరుండి జరిపించారు. ఇలా మీనా అంత్యక్రియలలో పాల్గొనడానికి ఓ కారణముంది. విద్యాసాగర్ కి మీనా తన కూతురు నైనిక అంటే అంతమైన ప్రేమ. ఈ విషయాన్ని మీనా ఎన్నో సందర్భాలలో వెల్లడించారు.ఇకపోతే తను తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి తన భర్త సహకారం ఎంతో ఉందని పలుసార్లు చెప్పిన మీనా తన భర్త పై ఉన్న ప్రేమను చివరి క్షణం వరకు తనకు అందించాలని ఇలా స్వయంగా అంత్యక్రియలలో పాల్గొన్నారు.
చివరి క్షణం వరకు భర్త పై ప్రేమను చూపించిన మీనా..
ఆయన అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత విద్యాసాగర్ చిత బస్మాన్ని స్వయంగా తన చేతులతో తీసుకొని వెళ్లారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది మీనా పై ప్రశంసల కురిపిస్తున్నారు. తన భర్త పట్ల ఎంతో ప్రేమ ఉన్న మీనా ప్రస్తుతం తన భర్త లేకుండా ఎలా ఉండగలుగుతారు. ఈమె తన కూతురు నైనిక కోసం త్వరగా మామూలు మనిషి కావాలంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.































