Naga Babu: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ సినీ పరిశ్రమకు మధ్య టికెట్ల విషయంపై కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లు పూర్తిగా తగ్గించడంతో పెద్ద సినిమాలు విడుదల కావాలంటే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సినిమా టికెట్ల విషయంపై మరొకసారి ఏపీ ప్రభుత్వం వారి నిర్ణయాన్ని ఆలోచించాలని ఇప్పటికే సినీ పెద్దలు కోరారు. అయితే ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

ఈ క్రమంలోనే ఈ సినిమా టికెట్ల వ్యవహారం పై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ఇప్పటికే పలు న్యూస్ డిబేట్ లు పెట్టారు. అలా ఏపీ మంత్రి పేర్ని నాని, వర్మ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగింది.ఇకపోతే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఆయన ఏపీ ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ పెద్ద సినిమాకు, చిన్న సినిమాకు చాలా తేడా ఉంటుందని ఇలా భారీ బడ్జెట్ చిత్రాలకు లోబడ్జెట్ చిత్రాలకు ఒకటే టికెట్ రేటు నిర్ణయిస్తే మార్కెట్ పూర్తిగా దెబ్బతింటుందని వర్మ ఆరోపించారు ఇలా ఏపీ ప్రభుత్వాన్ని అడగాల్సినవి పది ప్రశ్నలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా ఆ ప్రశ్నలను అడిగారు.
నేను అడగాల్సిన ప్రశ్నలను అడిగారు…
ఇలా వర్మ ఏపీ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నల వర్షం కురిపించడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ వీడియో పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఈ సందర్భంగా నాగబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. మీరు అడిగిన ప్రశ్నలన్నీ సత్యాలే.. నేను అడగాలనుకున్న ఈ ప్రశ్నలు మీ నోటి వెంట వచ్చాయనీ నాగబాబు వర్మకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశాడు. మరి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
My 10 questions to all concerned with the ticket rates issue in the honourable AP government https://t.co/EJH1CKYsQW
— Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2022