అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మెగా కోడలు ఉపాసన కొణిదెలకు తెలంగాణ ప్రభుత్వం నూతన బాధ్యతలు అప్పజెప్పింది. తాజాగా ఆమెను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉపాసన ఇప్పటికే మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటున్నారు. ఇప్పుడు క్రీడారంగంలో తెలంగాణ పురోగతికి తన వంతు సహకారం అందించనున్నారు. ఈ బాధ్యతలు అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ – కొత్త పాలసీ, కొత్త బృందం
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 2025 స్పోర్ట్స్ పాలసీని ప్రకటించింది. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ హబ్‌ను ఏర్పాటు చేసింది.
- ఛైర్మన్‌గా సంజీవ్ గోయెంకా
- కో-ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెల
ఈ హబ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతిభావంతులను గుర్తించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యం.
సినీ మరియు కుటుంబ సభ్యుల శుభాకాంక్షలు
ఉపాసన కొత్త బాధ్యతలకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ,
“మా కోడలు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా నియమితులవడం గౌరవంగా ఉంది. ఇది గొప్ప బాధ్యత కూడా. నీ నిబద్ధత, ప్యాషన్‌తో రాష్ట్రంలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహిస్తావని ఆశిస్తున్నాను. దేవుడు నీకు ఆశీస్సులు కలిగించాలి.” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
Our ‘Kodalu’ is the Co – Chairperson of Telangana Sports Hub now ☺️
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 4, 2025
Delighted at the appointment of @upasanakonidela to the esteemed position. It is as much an honour as much as it is a great responsibility.
Dear Upasana,
I am sure with your commitment and passion you will…



























