మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన నిహారిక ఆ తరువాత వెండి తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈమె హీరోయిన్ గా రావడాన్ని మెగా అభిమానులు పూర్తిస్థాయిలో తిరస్కరించారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈమె నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఇదిలా ఉండగా వెండితెరపై కలిసి రాకపోవడంతో నిహారిక పలు వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న నిహారిక గత ఏడాది డిసెంబర్లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
వివాహం తరువాత నిహారిక ఇండస్ట్రీకి దూరం అవుతుందని అందరూ భావించినప్పటికీ ఈమె పెళ్లి తర్వాత మరింత రెచ్చిపోతోంది.ఎక్కువగా తన గ్లామరస్ బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా నిహారిక గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. గోవాలో సముద్రతీరాన ప్రకృతిని ఆస్వాదిస్తూ కూర్చుని ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఎంతో గ్లామరస్ లుక్ లో ఉన్నటువంటి ఈ ఫోటోను షేర్ చేస్తూ తన భర్త చైతన్యకు థాంక్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిహారిక ఫోటోలు చూస్తుంటే మాత్రం ఈమె పెళ్లి తర్వాత మరింత అందాలను ఆరబోస్తూ గ్లామరస్ పాత్రలో కూడా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెబుతున్నట్లు ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక గోవా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

































