Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె మెగా కోడలిగా మాత్రమే కాకుండా అపోలో ఆసుపత్రి చైర్ పర్సన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తూ సలహాలు ఇస్తూ ఉంటారు.

ఇలా సోషల్ మీడియాలో మంచి కోసం ఉపయోగించే ఉపాసన తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక గోపురం ఉన్న ఫోటోని షేర్ చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి బలైందని చెప్పవచ్చు.ఈ క్రమంలోని ఈమె షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది.

జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాసన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గోపురం ఉన్న ఫోటో షేర్ చేశారు. అయితే ఈ గోపురంలో దేవుళ్ళతో పాటు కొందరు మనుషుల బొమ్మలు కూడా ఉన్నాయి.అయితే ఆ ఫోటోలలో తనతోపాటు రామ్ చరణ్ కూడా ఉన్నారు ఎక్కడున్నారో కనిపెట్టండి అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి…
ఇలా ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది సమయానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటో పై స్పందిస్తూ తమదైన శైలిలో మెగా కోడలు ఉపాసన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఫోటో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ మీ పై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ నెటిజన్లు ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
































